Telugu Bhasha Celebration (2024)
తెలుగుభాషా దినోత్సవం
ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, తెలుగు శాఖ, సుపర్ణ సాహితీ సంస్థసంయుక్తంగా తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా జ్యోతిప్రజ్జ్వలనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రాధమిక స్థాయి విద్యార్థులు (1,2 తరగతులు) తమ బృందగానంతో భారతీయతను చాటారు. ఆధునిక సమస్యలకు ఆధునిక పరిష్కారాలతో మోడ్రన్ విక్రమ్ – బేతాళ్ ను ప్రదర్శించారు 4,5 తరగతుల విద్యార్థులు. HPS బుర్రకథ పేరుతో పాఠశాల గురించి 7,8 తరగతుల విద్యార్థులు ప్రదర్శించిన బుర్రకథ ఆద్యంతం ప్రేక్షకులను అలరించింది. ఏకపాత్రాభినయ రూపంలో భీమసేనుడు ప్రేక్షకులను మెప్పించాడు. జానపద నృత్యంతో విద్యార్థులు కార్యక్రమానికి ముగింపు పలికారు.
విద్యార్థులు ప్రదర్శనలో చూపిన నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ఉపాధ్యాయ – ఉపాధ్యాయేతర సిబ్బంది తమ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తెలుగుశాఖ అధ్యక్షులు డా. సేనాపతి సత్యనారాయణ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.